Tuesday, November 26, 2024

ఏటీఎం లావాదేవీల్లో ఎస్‌బీఐ కొత్త నిబంధనలు.. 26వ తేదీ నుంచి అమల్లోకి

ఏటీఎంల నుంచి నగదు తీసుకునే విషయంలో ఎస్‌బీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు మంగళవారంనుంచి అమల్లోకి రానున్నాయి. తమ ఖాతాదారుడు ఏటీఎమ్‌లనుంచి నగదు విత్‌డ్రా చేయాలనుకుంటే ఆ ఖాతా తరపున రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్‌ ఎంటర్‌ చేశాకో నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. నగదు చెల్లింపులు, లావాదేవీల్లో అక్రమాలు నిరోధించేందుకు ఈ సౌలభ్యాన్ని ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఏటీఎమ్‌లనుంచి రూ.10వేలు, అంతకన్నా ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసినప్పుడే ఈ నిబంధన వర్తిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement