టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. అదే సమయంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీలు లేకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బిఐ తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ లలో ఉంచకూడదని ఈ మేరా ఖాతాదారులకు సూచించింది.
మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ లలో బ్యాంకింగ్ ,పిన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల సమాచారం cvv నెంబర్ సహా కీలక సమాచారాన్ని దాచి ఉంచితే మోసాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని ఫోన్ లో నుంచి డిలీట్ చేయాలని ఎస్బిఐ విజ్ఞప్తి చేసింది.