ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) విషయంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సోమవారం కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకు శాఖల్లో.. ఐఎంపీఎస్ పరిమితిని పెంచుతున్నట్టు తెలిపింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. 2022, ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఐఎంపీఎస్ లావాదేవీల కోసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల కొత్త స్లాబ్ జోడించబడింది. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల మధ్య ఐఎంపీఎస్ ద్వారా డబ్బు పంపడానికి రూ.20 చార్జీ చేయబడుతాయి. దీనికి జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. ఐఎంపీఎస్ అనేది.. రియల్ టైమ్ ఇంటర్ బ్యాంక్ ఫండ్ బదిలీని అనుమతించడానికి బ్యాంకులు అందించిన ఓ చెల్లింపు సేవ.
ఇది ఆదివారం, సెలవు రోజులు, 24 గంటలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. రూ.1000 వరకు పంపితే ఎలాంటి సర్వీస్ చార్జీలు వేయబడవు. రూ.1000 నుంచి రూ.10,000 వరకు రూ.2తో పాటు జీఎస్‌టీ, రూ.10వేల నుంచి రూ.1,00,000 వరకు రూ.4తో పాటు జీఎస్‌టీ, రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు ఐఎంపీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.12తో పాటు జీఎస్‌టీ వసూలు చేస్తారు. అయితే కొత్తగా రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయాన్ని చేర్చారు. దీనికి రూ.20తో పాటు జీఎస్‌టీ వసూలు చేయబడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital