Wednesday, November 20, 2024

వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ..

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు , రుణాలపైనా వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8న ఆర్బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు కోట్లలోపు రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై బ్యాంక్‌ ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న వడ్డీని 0.20 శాతం పెంచింది. రెండు కోట్లకు పైగా ఉన్న బల్క్‌ డిపాజిట్లపై వడ్డీని 0.75 శాతం పెంచింది. ఎంపిక చేసిన టర్మ్‌ ప్లాన్లకు కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ నెల 15 నుంచి రుణాల ప్రామాణిక రేట్లు కూడా పెరిగాయి.

నిధుల సేకరణ ఆధారిత వడ్డీ రేటులను 0.20 శాతం పెరిగాయి. దీంతో ఏడాది కాలపరిమితి రుణాలకు ప్రామాణికమైన వ్యయ ఆధారిత వడ్డీ రేటు 7.20 శాతం నుంచి 7.40 శాతం వరకు పెరుగుతుంది. చాలా వరకు గృహ, వ్యక్తిగత రుణాల వడ్డీ రేటు ఈ వ్యయ ఆధారిత వడ్డీ రేటుకు అనుసంధానమై ఉన్నాయి. మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఈ వడ్డీ రేట్లు 7.05 నుంచి 7.70 వరకు పెరుగుతాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement