Friday, November 22, 2024

దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం ఎస్‌బీఐ.. సెప్టెంబర్‌ త్రైమాసికం నికర లాభం 13,265 కోట్లు

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ గతంలో ఎన్నడూ లేనంతగా 13,265 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ అధ్బుత ఫలితాలు సాధించిందని బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖరా తెలిపారు. మంచి లాభాలు సాధించడంతో విశ్లేషకులు, బ్రోకింగ్‌ సంస్థల ప్రశంసలు అందుకుందని ఆయన చెప్పారు. 2021-22 ఇదే కాలంలో వచ్చిన లాభంతో పోల్చితే ఇది ఏకంగా 74 శాతం అధికం. మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వంటి బ్రోకింగ్‌ సంస్థలు ఎస్‌బీఐ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు.

భారత ఆర్ధిక వ్యవస్థకు ఎస్‌బీఐ ముఖచిత్రంలా ఉ ంటుంది. బ్యాంక్‌కు 47 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి ఎస్‌బీఐ ఏదో ఒక రకంగా సంబంధం ఉందన్నారు. పరిమాణం పరంగా ఇప్పటికే ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన భారత్‌ 2027 నాటికి మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని దినేష్‌ కుమార్‌ చెప్పారు.

సేవలు మరింత మెరుగుపడాలి

ఖాతాదార్లకు అందించే సేవలు మరింత మెరుగుపడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాతాదారుల అంచనాలకు అనుగుణంగా సామర్ధ్యాన్ని పెంచుకోవాల్సి ఉందన్నారు. ఖాతాదార్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. బ్యాంకింగ్‌ అనేది ప్రస్తుతం విజ్జా రంగంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఖాతాదార్లకు తగ్గట్లుగా ఆఫరలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలోనూ బ్యాంక్‌ ఖాతాదార్లకు సేవలు కొసాగాయని ఆయన చెప్పారు.

- Advertisement -

డిజిటల్‌ కు మారడంలో ఖాతాదార్ల ప్రవర్తనలోనూ మార్పు వచ్చిందన్నారు. సాంకేతికపై పెట్టుబడులు పెట్టడంతో, యోనో యాప్‌ ద్వారా కొత్త వ్యాపార సృష్టి జరిగిందన్నారు. ఎలాంటి ఆటంకాలు లేని సేవలు అందించగలిగామని చెప్పారు. బ్యాంక్‌ శాఖల్ని కూడా సమయానికి తెరవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement