ఆర్థిక వ్యవస్థలో ఎన్ఈటీసీ ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలు ప్రతీ ఏడాది భారీగా పెరుగుతూ పోతున్నాయి. ట్రాన్సాక్షన్ వ్యాల్యూమ్ పరంగా 53 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2022, ఫిబ్రవరిలో 234.64 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 158.96 మిలియన్ లావాదేవీలను నమోదు రికార్డు చేసింది. ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీని ఉపయోగించి నేరుగా ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతా నుంచి టోల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే వ్యవస్థ. వాహనం విండ్ స్క్రీన్‌పై అతికించబడుతుంది. నగదు లావాదేవీలకు స్వస్తి పలికేందుకు.. టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను కేంద్రం తీసుకొచ్చింది. ఎస్బీఐ కూడా ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందిస్తున్నది. దీని కోసం వాహన యజమానులు 1800 11 0018 కస్టమర్ కేర్‌ను సంప్రదించొచ్చు. ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సమీప ట్యాగ్ జారీ చేసే పాయింట్లకు (పీఓఎస్) సంబంధించిన లొకేషన్లను కూడా తెలియజేస్తారు. ఎస్బీఐ దేశ వ్యాప్తంగా దాదాపు 3000 పీఓఎస్ కేంద్రాలను కలిగి ఉంది. వినియోగదారులు ఫాస్ట్ ట్యాగ్ కోసం ఈ కేంద్రాలను సందర్శించొచ్చు. ఫాస్ట్ ట్యాగ్ సదుపాయాలను పొందొచ్చు.
ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ కోసం బ్యాంకులో ఫారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు వాహన యజమాని ఫొటో జత చేయాలి. అడ్రస్ ఐడీ ప్రూఫ్ అందజేస్తే.. ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్‌ను జారీ చేస్తారు. లిమిటెడ్ కేవైసీ అకౌంట్ ఎంపిక చేస్తే.. ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో రూ.10వేల కంటే ఎక్కువ ఉండకూడదు. నెలవారీ రీలోడ్ పరిమితి రూ.10వేలకు పరిమితం చేయబడింది. ఫుల్ కేవైసీ హోల్టర్ అకౌంట్ కేటిగిరి ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో రూ.1లక్ష కంటే ఎక్కువ ఉండొద్దు. ఇందులో ఎలాంటి నెలవారీ రీలోడ్ క్యాప్ లేదు. ఫాస్ట్‌ట్యాగ్‌ను యోనో ఎస్బీఐ ద్వారా కూడా రీచార్జి చేసుకోవచ్చు. యోనో ఎస్బీఐ లాగిన్ అయ్యాక.. యోనో పే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫాస్ట్ ట్యాగ్ క్విక్ పేమెంట్స్‌ను ఎంపిక చేసి యూపీఐ ఐడీ ద్వారా రీచార్జి చేసే వెసులుబాటు ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..