దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారీ లాభాలను గడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 62 శాతం మేర నికర లాభాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీని విలువ రూ.8,432 కోట్లుగా ఉంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి ఎస్బీఐ నమోదు చేసిన నికర లాభం రూ.5,196 కోట్లుగా ఉంది. ఈసారి ఈ గణాంకాలు భారీగా పెరిగాయి. రూ.8,432 కోట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడించింది. వచ్చే మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం ఉదయం రెగ్యులేటరీకి సమర్పించింది.
మొండి బకాయిలు రూ.6,974 కోట్లు..
అక్టోబర్-నవంబర్-డిసెంబర్ కాలానికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే మూడో త్రైమాసిక కాలంతో పోల్చుకుంటే.. ఈ సారి దేశీయ రుణ మంజూరులో 6.47 శాతం మేర పెరుగుదల నమోదు చేసుకుంది. మొండి రుణాలు 33 శాతం మేర క్షీణించినట్టు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొండి రుణ బకాయిల భారం రూ.10,342 కోట్ల రూపాయలు కాగా.. ప్రస్తుతం ఈ మొత్తం రూ.6,974 కోట్లకు తగ్గింది. బ్యాంకు స్థూల బ్యాడ్ లోన్స్ అస్సెట్స్ కూడా స్వల్పంగా తగ్గాయి. 4.90 శాతం నుంచి 4.50 శాతానికి క్షీణించాయి. నికర నిరర్ధక ఆస్తుల విలువ స్వల్పంగా పెరగడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది వరకు నెట్ ఎన్పీఏ విలువ 1.23 శాతం ఉండగా.. ప్రస్తుతం 1.34 శాతానికి పెరిగినట్టు ఎస్బీఐ తన మూడో త్రైమాసిక ఫలితాల్లో చూపించింది.
వడ్డీల నికర ఆదాయం 6.50శాతం..
వడ్డీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఇండియా సాధించిన నికర ఆదాయం 6.50 శాతంగా నమోదైంది. దీని విలువ రూ.30,687 కోట్లుగా ఉండింది. నికర వడ్డీ మార్జిన్ కూడా మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే.. 3.4 శాతం మేర పెరిగింది. ఆరు బేసిస్ పాయింట్లను అధికంగా నమోదు చేసింది. ప్రొవిజన్ కవరేజీ రేషియో 88.32 శాతంగా తమ ప్రతిపాదనల్లో పొందుపర్చింది. క్యాపిటల్ అడెక్వసీ రేషియో.. 13.23 శాతంగా నమోదైనట్టు స్టేట్ బ్యాంక్ ఇండియా స్పష్టం చేసింది.
ఎస్బీఐ బాటలో బ్యాంక్ ఆఫ్ బరోడా..
మరో జాతీయ బ్యాంకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాటలోనే పయనించింది. భారీ లాభాలను అందుకుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-2021) మూడో త్రైమాసికంలో 107 శాతానికి పైగా నికర లాభాలను పొందింది. దీని విలువ రూ.2,197.03 కోట్లుగా నమోదు చేసుకుంది. గత సంవత్సరం (2020-2021) మూడో త్రైమాసికానికి బ్యాంక్ బరోడా నమోదు చేసిన నికర లాభం.. రూ.1061.11 కోట్లు. మధ్యాహ్నం సదరు బ్యాంకు.. తన ఫలితాలను రెగ్యులేటరీకి సమర్పించింది. సంవత్సరం తిరిగే సరికి ఈ నెట్ ప్రాఫిట్‌ను 107 శాతానికి పెంచుకోగలిగింది. అక్టోబర్- నవంబర్- డిసెంబర్ కాలానికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను ఇందులో పొందుపర్చింది. నికర వడ్డీ ఆదాయాన్ని 14.38 శాతం పెరిగినట్టు వివరించింది. వడ్డీల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ.8,552.30 కోట్లుగా చూపించింది.
ఎన్పీఏ విలువ రూ.55వేల కోట్లు..
నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 3.13 శాతం, బేసిస్ పాయింట్లు 36గా పేర్కొంది. స్థూల నికర నిరర్ధక ఆస్తుల విలువ స్వల్పంగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి ఎన్పీఏల విలువ రూ.63,182 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.55,997 కోట్లకు తగ్గింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొండి రుణ బకాయిల భారం 7.25 శాతంగా నమోదైంది. నెట్ ఎన్పీఏ రేషియో 2.25 శాతంగా రికార్డు చేసింది. రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే.. కొంత తగ్గింది. రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే కొంత తగ్గింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ రెండో త్రైమాసికానికి నెట్ ఎన్పీఏ రేషియో 2.83 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన అడ్వాన్సులు భారీగా పెరిగాయి. 4.75 శాతంగా నమోదైంది. దీని విలువ 7.32 ట్రిలియన్లుగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ మొత్తం విలువ 1.28 ట్రిలియన్లు మాత్రమే ఉండింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..