న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొన్నవారికి తెలుగు యువత అధ్యక్షులు రవి నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు హాజరయ్యారు . తెలుగు యువత వినూత్నరీతిలో అమరావతిని కాపాడుకుంటేనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని, అమరావతి రైతులు చేపడుతున్న ఈ మహా పాదయాత్రకు తెలుగు యువత పూర్తి సంఘీభావం తెలియజేస్తుందని , రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం అంటూ నినాదాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..