Thursday, November 21, 2024

పక్షి రెక్కలపై సావర్కర్‌ ఎగిరేవారట.. బెంగళూరు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశం

కర్నాటక ప్రభుత్వ పాఠ్యపుస్తక కమిటీ కొత్తగా 8వ తరగతి పాఠ్యపుస్తకంలో వినాయక దామోదర్‌ సావర్కర్‌ జీవిత చరిత్రలో కొత్త వ్యాఖ్యాన్నిచేర్చారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో అండమాన్‌జైలులో ఉంటూ పక్షి రెక్కలపై కూర్చుని దేశాన్ని సందర్శించేవారని పాఠ్యపుస్తకంలో చేర్చారు. చరిత్రను తిరగరాస్తుంది అంటూ సావర్కర్‌ జీవితచరిత్రను చేర్చి వివాదానికి తెరతీశారు. అయినా సావర్కర్‌ ఉండే జైలు గోడలకు చిన్నపాటి రంధ్రం కూడా లేదు.. కానీ పక్షిరెక్కలపై ఎలా ఎగురుకుంటూ వెళతాడని సందేహం వెల్లువెత్తుతోంది.

బుల్‌బుల్‌ పక్షులు మాతం సావర్కర్‌ జైలు గదిని సందర్శించేవి అని రాశారు. ప్రతి రోజు పక్షి రెక్కలపై ఎగురుతూ దేశాన్ని చూసేవారని ఉంది. ఆ సమయంలో సావర్కర్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో పనిచేసేవారు. దీన్ని పాఠ్యపుస్తకంలో చేర్చడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement