Wednesday, January 8, 2025

Delhi | ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల భేటీ !

ప్రధాని నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏఐ తదితర అంశాలపై చ‌ర్చించారు. కృత్రిమ మేధను విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

భేటీ అనంతరం సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతీ భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందడానికి వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు.

సత్య నాదెళ్ల భేటీపై ప్రధాని మోదీ స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ తదితర అంశాలపై చర్చించామ‌న్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళిక గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement