చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈరోజు (శుక్రవాం) జరిగిన పురుషుల డబుల్స్‌లో డెన్మార్క్ జోడీ కిమ్ ఆస్ట్రప్-అండర్స్ స్కరప్ రాస్ముస్సేన్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ విజయం సాధించింది.
సాత్విక్-చిరాగ్ లు 21-16, 21-19 తేడాతో వరుస సెట్లలో డెన్మార్క్ ఆటగాళ్లను చిత్తు చేసి సెమీస్‌లోకి ప్రవేశించారు. కాగా, సెమీస్‌లో సాత్విక్ -చిరాగ్ జోడీ జపాన్ కు చెందిన టకురో హోకీ-యుగో కొబయాషి లేదా కొరియాకు చెందిన జిన్ యోంగ్-సియో సెయోంగ్ జేతో తలపడనుంది.
సింగిల్స్‌లో ముగిసిన భారత్ పోరు
మరోవైపు సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున మిగిలి ఉన్న ఏకైక ఆటగాడు లక్ష్య సేన్ కూడా ఇంటిబాట పట్టాడు. ఈరోజు జరిగిన పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఆటగాడు అండర్స్ ఆంటోన్సెన్తో తలపడిన సేన్ 18-21, 15-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.