చిట్యాల (ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లా చిట్యాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థులు అల్పాహారం, అన్నం కోసం ఆదివారం ఉదయం రోడ్డెక్కారు. పిల్లలకు సరిపడా భోజనం అందించడం లేదని, తాము అర్ధాకలితో అలమటిస్తున్నామని నిరసన చేపట్టారు.
తమకు అల్పారము, భోజనం అందించాలని, తమపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకులల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే కారణంగా ఇలా చేస్తున్నారని తెలిపారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని లేదని ఆరోపించారు. దీంతో తాము పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు తెలిపారు.