Saturday, November 23, 2024

కరోనా ఎఫెక్ట్: టొక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న సెరెనా..

టోక్యో ఒలింపిక్స్‌ కు కరోనా గట్టి దెబ్బె కొడుతోంది. కరోనా ప్రభావం తో ఇప్పటికే టోర్నీలో పాల్గొనేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే టాప్‌ ప్లేయర్లు రాఫెల్‌ నాదల్‌, డొమినిక్‌ థీమ్‌ సైతం ఒలింపిక్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నారు. రోజర్‌ ఫెదరర్‌ కూడా పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. అయితే టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఈ సారి ఒలింపిక్స్ లో ఆడటం లేదని తేల్చిచెప్పింది. ఒలింపిక్‌కు వెళుతున్న ఆటగాళ్ల జాబితాలో తాను లేనని.. ఆ విషయం తనకూ తెలుసునంది.

ఒలింపిక్స్‌ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయని చెప్పింది ఈ దిగ్గజం. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశీ క్రీడాభిమానులను అనుమతించడం లేదు. అలాగే ఆటగాళ్ల కుటుంబ సభ్యులను సైతం అనుమతించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తన చిన్నారి కూతురు ఒలంపియాకు దూరం కావాల్సి రావొచ్చన్న బెంగ వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement