Friday, September 20, 2024

TG | సర్దార్ సర్వాయి పాపన్న‌ జీవితం అందరికీ ఆదర్శం : డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు.

భవిష్యత్ తరాలకు పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలని అభిప్రాయపడ్డారు. పాపన్న గౌడ్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం బలహీనవర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని పేర్కోన్నారు. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటక కేంద్రం నిర్మాణానికి రూ.4.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

దీని బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ అని సూచించారు. ఇక అంతేకాదు.. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి ప్రజలకు తెలిసేలా పాకెట్ పుస్తకాలను ముద్రిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ రాజ్యానికి కూడా సర్వాయి పాపన్న ఆలోచనలే మార్గదర్శకం అని అన్నారు. సర్దార్ పాపన్న చరిత్ర చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. గోల్కొండను కూడా దాదాపు 6 సంవత్సరాల కాలం పాటు పాలించాడంటే చాలా గొప్ప వీరుడనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement