ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త.. శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. తన సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు శరవణన్ ఇష్టపడలేదని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. గతంలో ఈ సినిమాకు డీసెంట్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ కు శరవణన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ నెలలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం.