ఇంగ్లండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌కు కోచ్‌గా ఓ మహిళ ఎంపికయ్యారు. ఆమె ఎవరూ కాదు. ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్. దీంతో పురుషుల క్రికెట్‌లో తొలిసారి మహిళా కోచ్‌గా ఎంపికైన మహిళగా ఆమె ఘనత సాధించారు. ససెక్స్ జట్టుకు సారా వికెట్ కీపింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా టేలర్.. టెస్టుల్లో 300 పరుగులు, వన్డేల్లో 4,056 పరుగులు, పొట్టి క్రికెట్‌లో 2,177 పరుగులు సాధించారు. అన్ని ఫార్మాట్‌లో కలిపి 104 స్టంపింగ్‌లు, 128 క్యాచులు అందుకున్నారు. కాగా 2019లో సారా టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2017లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు గెలవడంలో సారా కీలకపాత్ర వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement