ముంబై – నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. నేడు మంబైలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు ఎన్సీపీ చీఫ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బీజేపీ వ్యతిరేక విపక్షాల కూటమి బాధ్యతలను తీసుకోవాల్సిందిగా పలు ప్రాంతీయ పార్టీల నేతలు ఆయనకు ఆఫర్ ఇచ్చినా అనారోగ్యం కారణంగానే సున్నితంగా తిరస్కరించారు. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన నిర్ణయం అమలులోకి వస్తే పార్టీ అధ్యక్షుడిగా ఎవరవుతారు అనే చర్చ మొదలైంది. ఎంపీగా ఉన్న ఆయన కుమార్తె సుప్రియా సూలే బాధ్యతలు చేపట్టే అవకాశాలున్పప్పటికీ శరద్ మేనల్లుడు అజిత్ పవార్ సైతం అధ్యక్ష పదవి రేస్ లో ఉండే అవకాశాలున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement