తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మరో ఏడాది, పచ్చని భవిష్యత్తు వైపు మరో అడుగు అన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రియమైన స్నేహితులు, ఉత్సాహభరితమైన పాఠశాల పిల్లలు.. ప్రతి ఒక్కరి నుండి ఇటువంటి సజీవ భాగస్వామ్యాన్ని చూడటం హృదయపూర్వకంగా ఉందన్నారు. ఈ రోజు తనతో ఒక మార్పు తీసుకురావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కలిసి ప్రకృతిని పెంపొందించడం కొనసాగిద్దామన్నారు.