Saturday, November 23, 2024

Sankranti Special Trains | 32 ప్ర‌త్యేక రైళ్లను న‌డ‌ప‌నున్న రైల్వే..!

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ల‌కు చేరుకోవాలనుకునే వారి కోసం వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సాధారణ రైళ్లలో ఇప్పటికే సీట్లు నిండిపోయాయి. దీంతో జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 రైళ్లను నడపనున్నట్లు తెలియ‌జేసింది.

ప్రత్యేక రైళ్లు ఇవే !

హైదరాబాద్ -కాకినాడ, సికింద్రాబాద్-నర్సాపూర్‌, హైదరాబాద్‌-కొచ్చువేలి, కాచిగూడ-భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌-గూడూరు, సికింద్రాబాద్‌-తిరుప‌తి, శ్రీకాకుళం-వికారాబాద్ మొద‌ల‌గు మార్గాల్లో ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. ఈ ప్ర‌త్యేక రైళ్లు అన్నింటిలోనూ ఫ‌స్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థ‌ర్డ్ ఏసీతో పాటు స్లీప‌ర్‌, జ‌న‌ర‌ల్ బోగీలు ఉండ‌నున్నాయి.

- Advertisement -

ఏ రోజు ఏ రూట్ల‌లో అంటే..

సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089) – జనవరి 7, 14 తేదీల్లో
బ్రహ్మాపూర్ – వికారాబాద్ (07090) – జనవరి 8, 15 తేదీల్లో
వికారాబాద్ – బ్రహ్మపూర్ (07091) – జనవరి 9, 16 తేదీల్లో
బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07092) – జనవరి 10, 17 తేదీల్లో
విశాఖపట్నం – కర్నూలు సిటీ (08541) – జనవరి 10, 17, 24 తేదీల్లో
కర్నూల్ సిటీ – విశాఖపట్నం (08542) – జనవరి 11, 18, 25 తేదీల్లో
శ్రీకాకుళం – వికారాబాద్ (08547) – జనవరి 12, 19, 26 తేదీల్లో
వికారాబాద్ – శ్రీకాకుళం (08548) – జనవరి 13, 20, 27 తేదీల్లో
సికింద్రాబాద్ – తిరుపతి (02764) – జనవరి 10, 17 తేదీల్లో
తిరుపతి – సికింద్రాబాద్ (02763) – జనవరి 11, 18 తేదీల్లో
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) – జనవరి 12 తేదీల్లో
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07272) – జనవరి 13 తేదీల్లో
సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) – జనవరి 8, 15 తేదీల్లో
బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) – జనవరి 9, 16 తేదీల్లో
నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) – జనవరి 10 తేదీల్లో
సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) – జనవరి 11 తేదీల్లో

Advertisement

తాజా వార్తలు

Advertisement