సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే జనవరి 2న 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ తరువాత జనవరి 4న మరో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్-బరంపురం మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్-బరంపురం మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. వీటితో కలిపి రైల్వే శాఖ నడపనున్న సంక్రాంతి ప్రత్యేక రైళ్ల సంఖ్య 42కి చేరింది.
ఈ ప్రత్యేక రైళ్లకు ముందస్తు టిక్కెట్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు తమ టిక్కెట్లను నేరుగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో లేదా IRCTC పోర్టల్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు.