- స్పెషల్ గెస్ట్ గా ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కిషన్ రెడ్డి ఇంటిని అలంకరించారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.
కాగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి, చిరంజీవికి ఘనస్వాగతం సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.