తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరిలో ఓ పాము హల్ చల్ చేసింది. నాగుపాము స్కూటీలోకి దూరడంతో వాహనదారుడు ఆందోళన చెందాడు. అయితే వెంటనే పాములు పట్టే వ్యక్తికి కాల్ చేసి రప్పించాడు. దీంతో అతడు పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ పామును పట్టుకుంటున్న సమయంలో స్థానికులంతా తమ సెల్ఫోన్లకు పని చెప్పారు. ఆ దృశ్యాలను ప్రతి ఒక్కరూ చిత్రీకరించి వైరల్ చేశారు. ఈ వీడియోను ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు. వర్షకాలంలో కొన్ని గెస్టులు రావడం సహజం. ఇలాంటి వాటిని ఒక పద్ధతి లేకుండా పట్టేందుకు ట్రై చేస్తే ప్రమాదం తప్పదు. పాములను పట్టేందుకు ఎప్పుడూ కూడా ట్రై చేయొద్దు అని, నైపుణ్యం గల వ్యక్తులే పాములను పట్టగలరని ఆయన ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: నష్టాలతో ముగిసిన మార్కెట్లు..