జింబాబ్వే తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న చేసుకున్న భారత్.. నేడు నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్ ఆడుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా సమష్టిగా రాణించి జింబాబ్వే ముందు డిఫెండింగ్ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఐదు ఓవర్లలోనే టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ – ర్యాన్ పరాగ్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించారు.
సిక్స్‌ల మోత మోగించిని సంజూ శాంసన్ (58) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇక రియాన్ పరాగ్ (22), శివం దూబే (26) ఆకట్టుకున్నారు. ఆఖర్లో వచ్చిన రింకూ సింగ్ (11 నాటౌట్) ఉన్నాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టగా… సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మౌటా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే ఈ నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడుతున్న జింబాబ్వే జట్టు 168 పరుగుల టార్గెట్‌తో చేజింగ్ ప్రారంభించనుంది.