Saturday, October 5, 2024

టాటా పవర్‌ సీఎఫ్‌ఓగా.. సంజీవ్‌ చురివాలా

కంపెనీ కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా సంజీవ్‌ చురివాలాను నియమించినట్టు టాటా పవర్‌ ప్రకటించింది. గతంలో సీఎఫ్‌ఓగా పని చేసిన రమేష్‌ సుబ్రమణ్యంకు టాటా గ్రూప్‌లోనే కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్టు టాటా పవర్‌ కంపెనీ తెలిపింది. చురివాలాకు ఆర్థిక సేవల రంగంలో 27 ఏళ్లకు పైగా పని చేసిన అపారమైన కార్పొరేట్‌ అనుభవం ఉంది. గతంలో డియాజియోలో రీజినల్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌-ఏపీఏసీ, గ్లోబల్‌ ట్రావెల్‌ రిటైల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. హోల్సిమ్స్‌ ఇండియన్‌ లిస్టెడ్‌ అనుబంధ సంస్థ అంబుజా సిమెంట్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టాటా పవర్‌ సీఈఓ, ఎండీ ప్రవీర్‌ సిన్హా మాట్లాడుతూ.. టాటా పవర్‌ కుటుంబంలోకి సంజీవ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

వ్యూహాత్మక ప్రణాళికలు, మెరుగైన పని సామర్థ్యంతో పాటు ఆర్థికపరమైన రంగాల్లో అపారమైన అనుభవం ఉంది. లాభదాయకమైన.. స్థిరమైన వృద్ధికి సంబంధించి తదుపరి దశవైపు వేగవంతంగా అడుగులు వేయడంలో సంజీవ్‌ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని పలు కీలక కంపెనీలు, గ్లోబల్‌ సంస్థల్లో పని చేసిన అనుభవం తమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. చురివాలా.. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ డిగ్రీని పొందారు. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్‌ ్డ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement