Friday, November 22, 2024

ఈ ఫ్యాన్ గాలి కోసం కాదండోయ్

పైన ఫోటో చూశారా? సమ్మర్ కదా.. భక్తులకు గాలి కోసం ఈ ఫ్యాన్ పెట్టారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవిలోని వీరభద్రస్వామి ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేలల్లో భక్తులు రావడంతో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఆలయ నిర్వాహకులు పలు చర్యలు తీసుకున్నారు. భక్తులందరికీ శానిటైజర్ అందించడం వీలు కాకపోవడంతో అధికారులు ప్రత్యేక ఫ్యాన్ లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కింది భాగంలోని ట్యాంకులో శానిటైజర్ ద్రావణం పోస్తే.. అది పైపుల ద్వారా ఫ్యాన్ రెక్కలు తిరిగే క్రమంలో వాటిపై చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది. ఆ ప్రాంతంలో భక్తులు చేతులు పెడితే శానిటైజర్ పడేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారన్నమాట. ఈ యంత్రం చూసి పలువురు భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement