Saturday, December 21, 2024

Sandya Stampede Effect – రేట్లు పెంపు.. బెన్ఫిట్ షో ల‌కు ఇక మంగ‌ళం – స్ప‌ష్టం చేసిన రేవంత్

హైదరాబాద్: తాను సిఎంగా ఉన్నంత‌కాలం తెలంగాణాలోని ధియేట‌ర్ల‌లో టిక్కెట్ల పెంపు, బెన్ఫిట్ షోలకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. అసెంబ్లీలో నేడు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఈనెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడు. అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు.

ఈ అంశంపై సీఎం స్పందించిన ముఖ్య‌మంత్రి సంధ్య థియేటర్కు వెళ్లేందుకు ఉన్నది ఒక్కటే దారి.. రావొద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని అన్నారు.. . ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున పెద్దగా మాట్లాడటం సరైంది కాద‌న్నారు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ నెల రెండో తేదిన చిక్కడపల్లి పీఎస్ లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసిందని,. ఈ నెల 4న పుష్ప 2 సినిమా విడుదలవుతుంద‌ని అందులో పేర్కొన్నార‌ని చెప్పారు. . ఆ రోజు ఈ చిత్రంలో నటించిన హీరో, హోరోయిన్, ప్రొడ్యూసర్ మరికొంత మంది సంధ్య థియేటర్కు వస్తున్నార‌ని, . బందోబస్తు కావాలని దరఖాస్తు చేసుకున్నార‌ని వివ‌రించారు. దీనిపై . మరుసటి రోజు చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్ యామమాన్యానికి లిఖితపూర్వక సమాధానం పంపించార‌ని రేవంత్ తెలిపారు.

సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయ‌ని,. థియేటరు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉంద‌ని. సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుంది ఆ పోలీసులు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.. దీంతో సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాద‌ని అంటూ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ఎవరైనా థియేటర్కు రావడానికి అనుమతి ఇవ్వ‌లేమ‌ని,. మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం అని పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారని స‌భ‌లో సిఎం వెల్ల‌డించారు.

పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పుష్పని చిత్రం ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చార‌న్నారు.. తన కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్ వద్దకు వచ్చార‌ని,. ఆ సమయంలో తమ అభిమాన నటుడిని చూడాలని చుట్టుపక్కల ఉన్న థియేటర్లలోని అభిమానులందరూ ఇక్కడికే వచ్చారని పేర్కొన్నారు. హీరో కారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేటు తెర‌వ‌డంతో ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన క్ర‌మంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయార‌న్నారు. . తోపులాటలో ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయింద‌ని, . ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని తెలిపారు.. మ‌నిషి ప్రాణాలు పోవ‌డం కార‌ణ‌మైన వారిని ఇప్ప‌టికే అరెస్ట్ చేశామ‌ని, ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది” అని సీఎం వివరించారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఇక‌పై కొత్త సినిమాల‌కు టిక్కెట్ పెంపు,అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌కూడద‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు..

ఆ హీరోకి కన్ను పోయిందా.. కాలుపోయందా..

అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని రేవంత్ చెప్పారు. 20 రోజులుగా ఆసుపత్రిలో చిన్నారి కోమాలో ఉంటే ఇంత వరకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదని రేవంత్ విమర్శించారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా? కాలు పోయిందా? ఎందుకు అందరూ ఆయన దగ్గరకు వెళ్లి ఓదారుస్తున్నారని మండిపడ్డారు. ఒక సినీ నటుడిని అరెస్ట్ చేస్తే ఇంతర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement