Tuesday, November 26, 2024

జోన్లవారీగా రైల్వే ప్రాజెక్టుల మంజూరు.. ఎంపీ నామా ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రైల్వే ప్రాజెక్టులను రాష్ట్రాల వారీగా కాకుండా జోన్ల వారీగా మంజూరు చేస్తామని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన, మంజూరు చేసిన కొత్త రైల్వే ప్రాజెక్టుల వివరాలను రాష్ట్రాల వారీగా తెలపాలని లోక్‌సభలో బీఆర్ఎన్ పార్టీ పక్షనాయకులు నామ నాగేశ్వరరావు గురువారం లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా తెలంగాణలో భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి రైల్వే మార్గానికి సంబంధించి ఇప్పటి వరకు సాధించిన పురోగతి, నిధుల కేటాయింపు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, గిరిజన ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే ఈ రైలు మార్గాన్ని కొవ్వూరు వరకు పొడిగించే అవకాశం మీదా ప్రశ్నలు అడిగారు.

- Advertisement -

భద్రాచలం రోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ అంశంలో నత్తుపల్లి వరకు రైల్వే మార్గాన్ని పూర్తి చేసిన కేంద్రం కొవ్వూరు వరకు రైల్వే లైన్‌ను పొడిగించకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నామా ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిస్తూ భద్రాచలం రోడ్ – సత్తుపల్లి రైల్లే లైన్ ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. భద్రాచలం రోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కొంత భరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. భూసేకరణ, అటవీ శాఖ క్లియరెన్స్, చట్టబద్ధమైన అనుమతులు, భౌగోళిక పరిస్ధితులు తదితర అంశాలపై ఆధారపడి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేసినట్టు ఆయన వివరించారు.

రామ్ మనోహర్ లోహియా జీవితం అందరికీ ఆదర్శం..

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాది సోషలిస్టు రాజకీయ నాయకులు, ఉద్యమశీలి రామ్ మనోహర్ లోహియా జీవితం అందరికీ ఆదర్శనీయమని నామ నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన జయంతి సందర్భంగా పార్లమెంట్‌లోని సెంట్రల్ హాలులో లోహియా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement