Friday, November 22, 2024

ఏసీబీ వలలో సనత్‌నగర్‌ విద్యుత్‌ అధికారి ఏఈ అవినాష్‌..

సనత్‌ నగర్‌, ( ప్రభన్యూస్‌ ) : ఇటీవల కాలంలో టౌన్‌ ప్లానింగ్‌, లైజనింగ్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, విద్యుత్‌ శాఖా, రిజిస్ట్రేష్రన్‌, జలమండలి ఇలా ఏ ప్రభుత్వ శాఖలో చూసుకున్న సరే కొంత మంది ప్రభుత్వ అవినీతి అధికారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ అక్రమార్జనకు తెరలేపుతూ, జేబులు నింపుకోవడమే పరమవిధిగా విధి నిర్వహణ కొనగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీరి అవినీతి ఆగడాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పేపర్‌ లలో కథనాలు వస్తున్నప్పటికీ వీరి ఉన్నత అధికారులు చూసి చూడనట్లు పట్టించుకోకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఆ అధికారులు కూడా ఎసిబి వలలో చిక్కకపోరా అని ఎదురుచూస్తున్న బాధితులు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో నగరంలోని పలువురు అధికారులు ఎసిబి వలలో చిక్కుకున్న ఘటనలు విదితమే.

తాజాగా ఏబీసీ వలలో మరో ప్రభుత్వ అవినీతి అధికారి..

ఇదే కోవలో తాజాగా మరో ప్రభుత్వ అవినీతి చేప ఎసిబి వలలో చిక్కుకుంది, వివరాల్లోకి వెళితే భాస్కర్‌ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ భరత్‌నగర్‌ లో ఒక ట్రాన్స్‌ ఫార్మర్‌ ఏర్పాటు కోసం ఆన్‌ లైన్‌ లో మర్చి నెలలో దరఖాస్తు పెట్టుకున్నారు. దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ అనంతులు జారీ చేస్తూ పనులు మొదలు కాకపోడంతో సనత్‌ నగర్‌ విద్యుత్‌ అధికారి ఏఈ అవినాష్‌, లైన్‌ ఇన్స్పెక్టర్‌ లైన్‌ ఇన్స్పెక్టర్‌ కృపానంద రెడ్డి లను సంప్రదించగా ఏఈ అవినాష్‌ 25 వేలు, లైన్‌ ఇన్స్పెక్టర్‌ కృపానంద రెడ్డి ఏడు వేల ఐదు వందల రూపాయలు లంచం డిమాండ్‌ చేసారు. కాగా ఏఈ అవినాష్‌ కు 15 వేలు, లైన్‌ ఇన్స్పెక్టర్‌ కృపానంద రెడ్డికి మూడు వేల ఐదు వందల లంచం బాధిత కాంట్రాక్టర్‌ భాస్కర్‌ సమర్పించుకున్నారు. అయినప్పటికీ మిగతా డబ్బులు కూడా ఇస్తేనే స్లప లైన్‌ జారీ చేస్తామంటూ అధికారులు లంచం వేధింపులకు పాల్పడంతో వేధింపులు తట్టుకోలేక ఎసిబి అధికారులను బాధిత కాంట్రాక్టర్‌ భాస్కర్‌ సంప్రదించి విషయం వారికి చెప్పాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు ఏఈ అవినాష్‌ పది వేలు లంచం తీసుకొని లెక్కపెడుతుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఇద్దరు అవినీతి అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 17 అధికారులపై కూడా ఏబీసీ దృష్టి సారించాలి..

ఇదే ప్రాంతం కు చెందిన జిహెచ్‌ఎంసి సర్కిల్‌ 17 లోని టౌన్‌ ప్లానింగ్‌, లైజనింగ్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ అధికారులపై కూడా ఎసిబి అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు బాధితులు వేడుకుంటున్నారు. సదరు అధికారులు వ్యాపార బడా బాబులకు, నిర్మాణ బిల్డర్‌ లకు కొమ్ము కాస్తూ, ఇంటి నిర్మాణలు చేపట్టుకునే మధ్యతరగతి కుటుంబాలకు నోటీసు లు జారీ చేస్తూ వేధిస్తుండడం లేదా చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే వారి పట్ల ఫుట్‌ పాత్‌ ఆక్రమణల ఫిర్యాదులు వచ్చాయంటూ కూల్చివేతలు చేపడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతంలో టిఎస్‌ బిపాస్‌ మరియు జిహెచ్‌ఎంసి నియమ నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, గత కొన్నేళ్లుగా ఫుట్‌ పాత్‌, రహదారుల ఆక్రమణలతో కొనసాగుతున్న అక్రమ వ్యాపారాలే నిదర్శనం వీటి పట్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెద్ద ఎత్తున ఫిర్యాదులు, పత్రికలలో కథనాలు వస్తున్నప్పటికీ కూడా సదరు అధికారులు ఎందుకు స్పందించడం లేదో, చర్యలు ఎందుకు చెప్పటడం లేదో అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement