తమిళ హీరోలతో తెలుగు నిర్మాతలు ద్విభాషా చిత్రాలను నిర్మిస్తు న్నారు. తాజాగా ధనుష్ హీరోగా సితార ఎంటర్-టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సార్(తెలుగు)/వాతి(తమిళం) చిత్రాన్ని నిర్మిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమా లలో భాగంగా కథానాయిక సంయుక్త మీనన్ విలేకర్లతో ముచ్చటించి ‘సార్’ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీరు సినీరంగానికి ఎలా వచ్చారు? మీ నేపథ్యం ఏమిటీ?
2016 లో మొదటి సినిమా చేసినపుడు సినిమానే కెరీర్ గా ఎంచుకోవాలి అనుకోలేదు. నేను కేరళలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయిని. మొదటి సినిమా తర్వాత చదువు కోసం ఒక ఏడాది విరామం తీసుకున్నాను. కానీ మళ్ళీ సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటు-న్నాను. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్ లో ఉత్తమ దశ అనిపించింది.
మీ తాజా చిత్రం సార్ గురించి చెప్పండి?
నేను తెలుగులో మొదట బింబిసార, ఆ తరువాత విరూపాక్ష సినిమా అంగీకరించాను. సితార బ్యానర్ లో భీవ్లూ నాయక్ లో నటించే అవకాశమొచ్చింది. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో నేను పోషించిన పాత్రలో చేసిన మార్పులు నచ్చి, నా నటన నచ్చి మరో సినిమా అవకాశమిచ్చారు. అదే సార్ చిత్రం. దర్శకుడు వెంకీ గారు కథ చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను.
క్యోరెక్టర్ పోషణ కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?
ఇందులో నేను పల్లెటూరికి చెందిన తెలుగు అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అంతేకాకుండా టీ-చర్ల చీరకట్టు- ఎలా ఉంటు-ంది? వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటు-ంది? ఇలాంటివన్నీ గమనించాను.
కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో కలిసి నటిస్తున్నారు?
తొలుత కథ ఎలా ఉంది?, పాత్ర ఎలా ఉంది? అని చూస్తాను. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇంకా దానికి స్టార్ తోడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. భీవ్లూ నాయక్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటు-ంది. నే ను మీనాక్షి అనే బయాలజీ టీ-చర్ పాత్రలో కనిపిస్తాను. కథలోకి వె ళ్ళిన ప్పుడు హీరో పాత్రతో పాటు- నా పాత్ర ప్రయాణం సాగుతుం ది.
సినిమాకథాంశం ఎలా ఉంటుంది?
ఇందులో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. వినోదం కూడా ఉంటు-ంది.
దర్శకుడు వెంకీ అట్లూరి గురించి చెప్పండి?
ఆయనలో మంచి రచయిత, దర్శకుడు ఇద్దరూ ఉన్నారు. నటీ-నటు-ల నుంచి మంచి ఎమోషన్స్ రాబట్టు-కుంటారు. ఆయన సెట్ లో చాలా సరదాగా ఉంటారు.