హైదరాబాద్, (ప్రభ న్యూస్) : శాంసంగ్, ఇండియాలో 2022 మార్చితో అంతమయ్యే మొదటి త్రైమాసికంలో టాబ్లెట్ బిజినెస్‌లో తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకొంది. ఈసందర్భంగా శాంసంగ్ ఇండియా న్యూ కంప్యూటింగ్ బిజినెస్ హెడ్ సందీప్ పోశ్వాల్ మాట్లాడుతూ… ఇటీ వలనే ఆవిష్కరించిన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సీరీస్, గెలాక్సీ ట్యాబ్ ఏ8 సిరీస్‌కి లభించిన ప్రజాదరణ, టాబ్లెట్ మార్కెట్లో తమ నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడానికి మమ్మల్ని క్రియాత్మకం చేసిందన్నారు.
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సీరీస్, ప్రత్యేకించి గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా విజయం, విలువను జోడించి, రోజువారీ పనులను సమర్థవంతంగా పరిష్కరించే అర్థవంతమైన ఆవిష్కరణలకు వినియోగదారులు విలువనిస్తారనే వాస్తవానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..