హైదరాబాద్, (ప్రభ న్యూస్) : కస్టమర్లకు పర్యావరణ చైతన్యం ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు భారతదేశం వ్యాప్తంగా ఉన్న శాంసంగ్ ఇండియా సర్వీస్ కేంద్రాలు అంతర్జాతీయ చొరవలో భాగంగా కాగితం రహితమైన పద్ధతిని అనుసరించాయి. ఈసందర్భంగా శాంసంగ్ ఇండియా కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుటిన్హా మాట్లాడుతూ…
దేశవ్యాప్తంగా ఉన్న తమ సర్వీస్ కేంద్రాలు ఇప్పుడు పర్యావరణ చైతన్యం గల ప్రత్యామ్నాయాన్ని అందించే కాగితం రహితమైన కార్యకలాపాలను అనుసరిస్తున్నాయన్నారు. ఇది లావాదేవీ సమయాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఇది కస్టమర్స్ కు సౌకర్యం కలిగిస్తోందన్నారు. భౌతిక డాక్యుమెంట్స్ గురించి ఇంక శ్రద్ధవహించవలసిన అవసరం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.