హైదరాబాద్, (ప్రభ న్యూస్) : శాంసంగ్ ఇండియా భారతదేశపు ఉ్వజ్జలమైన యువ మేధస్సు కోసం సాల్వ్ ఫర్ టుమారోగా పిలువబడే ఆకర్షణీయమైన నవీన సవాలుతో ముందుకు వచ్చింది. శాంసంగ్ వారి ఫ్లాగ్ షిప్ సీఎస్‌ఆర్ ప్రోగ్రాం, సాల్వ్ ఫర్
టుమారో వ్యవస్థలో 16-22 సంవత్సరాల యువత భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా పాల్గొనవచ్చని తెలిపింది. సమాజాన్ని మార్చడానికి వాస్తవిక ప్రపంచం సమస్యల్ని పరిష్కరించడానికి ఇది ఒక అవకాశం.
వివిధ శిక్షణా మాడ్యూల్స్, బూట్ క్యాంప్స్ అండ్ వర్క్ షాప్స్ ద్వారా ఎఫ్ ఐటీటీ అండ్ శాంసంగ్ నాయకుల సలహా క్రింద తమ ఆలోచనతో పని చేయడానికి ఇది ఒక అవకాశం ఇస్తుంది. ప్రముఖ ముగ్గురు జాతీయ విజేతలకు తమ వినూత్నమైన ఆలోచనలకు గాను ఐఎన్‌ఆర్ 1 కోటి మెగా సహాయం, ఐఐటీ ఢిల్లీ నిపుణులు నుండి మార్గదర్శకుల సహాయం పొందుతారని తెలిపింది. తమ ఆలోచనకు ప్రాథమిక రూపాన్నిఅభివృద్ధి చేయడానికి ఐఎన్‌ఆర్ 1 కోటి వరకు సహాయానికి అవకాశం పొందవచ్చని శాంసంగ్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.