Saturday, November 23, 2024

టీ7 షీల్డ్‌ పోర్టబుల్‌ ఎస్‌ఎస్‌ డీని భారతదేశానికి తెచ్చిన శాంసంగ్‌..

హైదరాబాద్‌ (ప్రభ న్యూస్‌) : భారతదేశంలో అతి పెద్ద, అత్యంత విశ్వశనీయమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ గురువారం తమ ఆధునిక ఎక్స్‌ టర్నల్‌ స్టోరేజ్‌ డివైజ్‌ టి7 షీల్డ్‌ పోర్టబుల్‌ సాలిడ్‌ స్టేట్‌ డ్రైవ్‌ (పీఎస్‌ఎస్‌ డీ)ఆరంభోత్సవాన్ని ప్రకటించింది. ఈసందర్భంగా శాంసంగ్‌ ఇండియా ఎంటర్‌ ప్రైజ్‌ బిజినెస్‌ కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ సేథీ మాట్లాడుతూ…. సృజనాత్మకమైన ప్రొఫెషనల్స్‌, ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించబడిన, టి7 షీల్డ్‌ పోర్టబుల్‌ ఎస్‌ఎస్‌ డీ అనేది మన్నికైన, ఉన్నతమైన పని సామర్థం కలిగిన, విశ్వశనీయమైన ఎస్‌ఎస్‌ డీ.. వినియోగదారుల డేటా నీటికి బహిర్గతమైన, బయట ఉపయోగించిన, క్రింద పడిపోయినా సురక్షితంగా ఉంచేలా నిర్థారించే కఠినమైన, దృఢమైన డివైజ్‌ ఇదని తెలిపారు. టీ-7 షీల్డ్‌ పోర్టబుల్‌ ఎస్‌ఎస్‌ డీ విస్తృతమైన అనుకూలతని అందిస్తోందన్నారు. పీసీలు, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌, గేమింగ్‌ కన్సోల్స్‌ సహా పలు డివైజ్‌ లలో కొత్త ఎస్‌ఎస్‌ డీ ని వినియోగదారులు ఉపయోగించేలా వీలు కల్పిస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement