Friday, November 22, 2024

తిరుమల శ్రీవారి భక్తులకు సంప్రదాయ భోజనం

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజూ లక్షల్లో భక్తులు వస్తుంటారు. వారికి సకల సౌకర్యాలు తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుపతి లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తారు. దర్శనం అనంతరం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నప్రసాద నిలయంలో భోజనం కూడా ఉంటుంది. అయితే ఈ భోజనంలో సంప్రదాయ భోజనం పేరుతో సరికొత్త విధానం అమలులోకి రానుంది.

గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ధాన్యాలతో చేసిన వంటకాలను ఈ సంప్రదాయ భోజనంలో ఉండనున్నాయి. తొలుత 15నుండి 30రోజుల పాటు సంప్రదాయ భోజనాన్ని భక్తులకు విక్రయించనున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంత ఖర్చు చేసారో అంతే ధరకు సంప్రదాయ భోజనం భక్తులకు అందిస్తారు. మరోవైపు త్వరలోనే పంచగవ్వ ఉత్పత్తులైన సబ్బులు, అగరబత్తీలు సహా 15 రకాల ఉత్పత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కర్నూలు జిల్లాలో దంపతుల ఆత్మహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement