టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరగా కోలుకొని పూర్వ స్థితికి రావాలని కాంక్షించారు నటి శ్రియ. సమంత చాలా మంచి వ్యక్తి. అలాగే ఆమె స్ట్రాంగ్ గర్ల్. ఇది ఆమె జీవితంలో చిన్న దశ మాత్రమే. సమంత ఈ రుగ్మతను ఎదిరించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుంది. సమంత తిరిగి కోలుకుంటుందన్నారు. సమంత, శ్రియా మనం మూవీలో కలిసి నటించారు. నాగార్జునకు జంటగా శ్రియా నటించారు. నాగ చైతన్యతో సమంత జోడీ కట్టారు.
మనం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. తరచుగా కలుస్తారని సమాచారం. మరోవైపు సమంత లేటెస్ట్ మూవీ యశోద మంచి విజయం సాధించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీతో కోట్లు కొల్లగొట్టిన సమంత ఔరా అనిపించింది. చాలా మంది హీరోల కంటే బెటర్ వసూళ్లు రాబట్టి తన ఫేమ్ ఏమిటో నిరూపించింది. సమంత ఓకే అంటే యశోద 2 సిద్ధంగా ఉందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు.