Friday, November 22, 2024

Samantha – కొత్త హెయిర్ క‌ట్..స‌రికొత్త అందాలు..

టాలీవుడ్ స్టార్ నటి సమంత . ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేసింది. విజయ్ దేవరకొండతో ఖుషి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ను అతి కష్టం మీద కంప్లీట్ చేసేసింది. ఆ తర్వాత కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో కొంత సమయాన్ని గడిపింది. కాగా, తాజాగా సామ్ తన కొత్త లుక్ ను అభిమానులకు పరిచయం చేసింది.

తన హెయిర్ ను పూర్తిగా కట్ చేసి.. షార్ట్ హెయిర్ తో క్యూట్ లుక్ తో అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్ తో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు సామ్ ప్రస్తుతం వెకేషన్ తన స్నేహితులతో కలిసి బాలి దేశానికి వెళ్లింది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నటువంటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి కూడా వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement