Saturday, June 29, 2024

Sam Pitroda | మళ్లీ శామ్ పిట్రోడా కే ఆ పదవి…

లోక్‌సభ ఎన్నికల వేళ.. దక్షిణ భారతీయులపై కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారతీయుల చర్మ రంగుపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో అతడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆ పదవిని అప్పగించింది. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీర్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ కాంగ్రెస్ పార్టీ పదవి కట్టబెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement