Friday, November 22, 2024

Sales – అమ్మ‌కానికి విశాఖ ఉక్కు స్థలాలు… బిడ్స్ కు ఆహ్వానం….

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్థులు ఒకటొకటిగా అమ్మకాలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైపోయి నేడు వేగంగా పావులు కదుపుతోంది. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కుర్మాగారం ఉనికి దెబ్బతీయడంతో ప్రయివేట్‌ వ్యక్తులకు విశాఖ ఉక్కు కర్మాగారంను అమ్మేసేందుకు సిద్ధమై రంగం సిద్ధం చేసిన కేంద్రప్రభుత్వం, ఉక్కు ఆవిర్భావం నేపద్యంలో కేంద్రప్రకటన వచ్చినప్పటి నుంచి నిరసన గళం విప్పి ఉద్యమిస్తున్న వారి ఆవేదన, ఆక్రోశం పట్టించుకోనట్లే కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. కేవలం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను విక్రయించే ప్రకటన చేయడంతో పాటు ఉద్యోగితను తగ్గించడం, దశల వారీగా ఒక్కో అంశంతో ఉక్కు ఉనికిని చంపేసే స్తున్న కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, ఉక్కు ఉద్యోగుల స్థలాల నూ విక్రయించేందుకు సిద్ధమైంది. విశాఖ పట్నం ఉక్కు కర్మాగా రం ఆస్థులను కేంద్ర ప్రభుత్వం బేరానికి పెట్టేయడంతో స ర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ దశగా ఇప్పటికే ముమ్మర ఏర్పా ట్లు చేసిన కేంద్ర ప్రభుత్వ ధోరణి పట్ల నిరసన వ్యక్తం అవ్వడంతో రోజు రోజుకీ ఆందోలన తీవ్రరూపం దాల్చుతుంది. ఉక్కు కర్మాగార ఆస్ధుల విలువను మదింపు చేసేం దుకు వివిధ సంస్థల్ని ఆహ్వానిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులను జారీ చేసిన విషయం ఆంధ్రప్రభ పాఠకులకు తెలిసిందే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆస్థుల విలువను లెక్కించేందుకు బిడ్‌ల ఆహ్వానం గత ఏడాదే కేంద్రం తలపెట్టింది. కేంద్రప్రభుత్వ డిజిన్వెస్టుమెంట్‌ కేంద్ర విభాగం దీనికి సంబంధించిన ఏర్పాట్లు గట్టిగానే చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖలోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిజిన్వెస్టుమెంట్‌ విభాగం సంబంధిత ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసి ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత బిడ్‌లను దాఖలు చేయాలనే నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.

అంతటితో ఆగకుండా విశాఖపట్నం నగర నడిబొడ్డున ఉన్న హెచ్‌బీకాలనీలోని 588 ప్లాట్‌లను కూడా విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. 22.90 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ల్యాండ్‌ అమ్మకం పెట ్టడంతో పాటూ ఆటోనగర్‌, గాజువాకల్లోని 76 ఇళ్లను, దీనితో పాటూ పెద గంట్యాడ పాత హెల్త్‌ సెంటర్‌ను అమ్మకానికి సిద్ధం చేసింది.ఈ మొత్తం కొనుగోలు చేసేవారు గానీ, విభాగాలుగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారు కానీ పది రోజుల్లో సంప్రదించాలనే సందేశం కూడా ఇచ్చింది. తాజా ప్రకటన ప్రకారం ప్లాట్‌లూ, ఇళ్లును అమ్మేసేందుకు సిద్ధమై ప్రకనలు చేసిన విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం అంతిమంగా సంబంధిత బిడ్‌లకు గడువుగా పది రోజులు మాత్రమే ఇచ్చి ప్రకటించి ఈ కోణంలోనూ స్టీల్‌ ప్లాంట్‌ ఆస్థుల అమ్మకాలతో తన వేగం పెంచినట్లుగా ప్లాంట్‌ కార్మిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేంద్రప్రభుత్వ తీరు నేపద్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేలాది కుటుంబాల నిరసనల గళంలు తీవ్రత ఎంత పెరుగుతున్నప్పటికీ నిరసనలు నిరసనలుగానే ఉండగా, అంతర్గతంగా కేంద్రం తన పని తాను ఎవ్వరినీ, ఏ అంశాన్ని పట్టించుకోకుండా పతాక స్థాయికి చేర్చుతూనే ఉందని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement