Friday, November 22, 2024

భారీగా పడిపోయిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావంతో వాహనరంగం కుదేలవుతోంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయని వెహికల్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ ఆర్గనైజేషన్‌ సియామ్‌ వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు కూడా క్షీణించాయని సియామ్‌ తెలిపింది. మార్చి నెలలో 4శాతం తగ్గి 2.79లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అయితే గత ఏడాది మార్చిలో 2.90లక్షల వాహనాలు అమ్ముడైనట్లు సియామ్‌ పేర్కొంది. టూవీల్‌ వాహనాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితిని దిగజారిన వాహన అమ్మకాలు తెలుపుతున్నాయి.

మరోవైపు విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు కూడా వాహన అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 21శాతం క్షీణించాయి. గత సంవత్సరం 14.96లక్షలు కాగా 11.84లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. గత పదేళ్లలో ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement