ముంబైలో 10 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ హోమ్స్ అమ్మకాలు 50 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు వీటి అమ్మకాలు 11,400 కోట్లకు చేరాయని ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టి, కేర్ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తెలిపాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 83 శాతం పెరిగాయి. మూడు సంవత్సరాలుగా ముంబైలో లగ్జరీ హోమ్స్ అమ్మకాలు పెరుగుతున్నాయి.
మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ముంబై సీటీలో అత్యంత ఖరీదైన ఇళ్ల అమ్మకాలు భారీగానే పెరుగుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో 5,300 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆల్ట్రా లగ్జరీ కేటగిరిలో 40 నుంచి 70 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు 64 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం మలబార్ హిల్స్ ప్రాంతంలో ఒక ప్రాపర్టీ 1,580 కోట్లకు విక్రయించారు.