Tuesday, November 26, 2024

8 నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. హైదరాబాద్‌లో మాత్రం తగ్గేదే లే !

దేశంలోని 9 నగరాల్లో అమ్ముడు కావాల్సిన ప్లాట్లు, ఇళ్ల సంఖ్య సెప్టెంబర్‌ నెలలో తగ్గాయి. ఈ నగరాల్లో వీటి అమ్మకాలు 12 శాతం తగ్గి 4,77,570 యూనిట్లకు పరిమితం అయ్యాయని అనాలటిక్స్‌ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ తెలిపింది. 2021 సెప్టెంబర్‌ చివరి నాటికి ఈ సంఖ్య 5,40,849గా ఉన్నాయి. ఢిల్లిdలో ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు 32 శాతం, బెంగళూర్‌లో 25 శాతం తగ్గాయి. హైదరాబాద్‌ నగరంలో మాత్రం వీటి అమ్మకాలు 19 శాతం పెరిగాయని ఈ సంస్థ తన నివేదికలో తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 9 నగరాల్లో కలిపి 1,08,817 ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 87,747గా ఉన్నట్లు తెలిపింది.

నాణ్యమైన ఇళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకు అనుగుణంగానే అనేక కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమైనట్లు ప్రాప్‌ఈక్విటీ ఎండీ సమీర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి ఈ నగరాల్లో విక్రయించాల్సిన ఇళ్లు థానేలో 1,03,862, పుణేలో70,475, ముంబైలో 55,059, నవీ ముంబైలో 29,793, బెంగళూర్‌లో 54,612, ఢిల్లిdలో 37,494, చెన్నయ్‌లో 18,876, కోల్‌కతాలో18,486, హైదరాబాద్‌లో 88,913 ఇళ్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement