Tuesday, November 26, 2024

భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం నిలిపివేత.. ఆస్తకి చూపని బిడ్డర్లు

సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలుకు బిడ్డర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరించేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ (డీఐపీఏఎం దీపం) ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కోరింది. కర్నాటకలోని భద్రావతిలో సేయిల్‌కు చెందిన విశ్వేస్వరయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (వీఐఎస్‌పీ) ఉంది. ఇందుకు తగినన్ని బిడ్లు రాకపోవడ ంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు. 2016 అక్టోబర్‌లో ప్రభుత్వం ఈ స్టీల్‌ ప్లాంట్‌లో సేయిల్‌కు ఉన్న వంద శాతం వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.

భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (బీపీసీఎల్‌)లోనూ 53 శాతం వాటా విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికి కూడా తగినన్ని బిడ్స్‌ రాకపోవడంతో తాత్కాలికంగా దాన్ని నిలిపివేశారు. గత నెలలో సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(సీఈఎల్‌) లోనూ వంద శాతం వాటా విక్రయానికి దీపం విడ్స్‌ను ఆహ్వానించింది. దీనికి కూడా తగినన్ని బిడ్స్‌ రాకపోవడం వచ్చిన ఒక్క బిడ్స్‌ నందాలాల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌ అర్హత సాధించలేకపోయింది. దీంతో ఈ ప్రక్రియను కూడా నిలివేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు మూడు కంపెనీల ప్రవేటీకరణ ప్రయత్నాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement