అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ అధ్యాపకులకు ఏఐసీటీఈ పే స్కేల్స్- 2016 ప్రకారం వేతన సవరణ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 10 విడుదలైంది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్ చైర్మన్) కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పాలిటెక్నిక్ లెక్చరర్ల జేఏసీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీ ఈ పేస్కేల్స్- 2016 ను పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ జేఏసీ కన్వీనర్ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వినర్లు రామ్మోహన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. ఆయుష్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బల్లయ్య తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆయుష్ డాక్టర్ల సమస్యలు వివరించారు. ఆయుష్ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ సానుకూలత వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.