Saturday, November 23, 2024

Spl Story : నాన్‌ టీచింగ్‌ సిబ్బందికే లక్షల్లో జీతాలు!

ప్రభన్యూస్‌, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ తో పాటు శివారు జిల్లాల్లో విస్తరించిన శ్రీచైతన్య, నారాయణ(చైనా) మాఫియా సంస్థల్లో పని చేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బందికే లక్షల్లో జీతాలు చెల్లింపులు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్‌ కంటే తక్కువ అర్హత ఉన్న వ్యక్తులను జీఎం, డీజీఎం, బీఎం, డీన్‌ తదితర పదవులను ఆశ చూపి.. కార్పొరేట్‌ స్థాయిల్లో జీతాలు చెల్లిస్తుండటం గమనార్హం. ఒక్కోక్కరు ఐదు బ్యాంకులకు పైగా ఖాతాలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులను మోసం చేస్తుండటం గమనార్హం. .విద్యనభ్యసించే సంస్థల్లో లేని పోస్టులను క్రియేట్‌ చేసి తమ దందా కొనసాగిస్తుండటం గమనార్హం. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లాంటి సంస్థలు ఎందుకు విచారించడం లేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది.?

శీచైతన్య, నారాయణకు (చైనా మాఫియా) విద్యా సంస్థల్లో అనుమతి లేని జీఎం, డీజీఎం, ఏజీఎం, బీఎం, డీన్‌ తదితర పోస్టులను సృష్టించి నాన్‌ టీచింగ్‌ సిబ్బందికే అధికంగా జీతాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. అదే నాన్‌ టీచింగ్‌ సిబ్బందికీ ఒక్కొక్కరి ఐదు లక్షలకు పైగా జీతాలు చెల్లిస్తుండం గమనార్హం. దీంతో సంబంధిత వ్యక్తుల పేరు ఆయా బ్యాంకుల్లో ఐదేసి ఖాతాలను ప్రారంభించి..ఆదాయపు పన్ను శాఖ అధికారులను సైతం మోసం చేస్తుండటం తెలిసిందే. టీచింగ్‌ స్టాఫ్‌..సంస్థ వృద్ధికి విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు రాణించడానికీ కృషి చేసినా.. నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కంటే తక్కువ వేతనాలు ఇస్తూ..వారిని అనేక కేసుల్లో బలి పశువులుగా మారుస్తుండటం గమనార్హం. దీంతో శ్రీచైతన్య, నారాయణకు సంబంధించిన జూనియర్‌ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లుగా ఉండాలంటేనే వ్యక్తులు జంకాల్సిన దారుణమైన పరిస్థితులున్నాయి. ఎందుకంటే ఏ సమయంలో ఏ కేసు వచ్చి మీద పడుతుందోననే ఆందోళన చెందుతున్నారు. ఈ సంగతి పక్కనుంచితే..శ్రీచైతన్య, నారాయణ సొసైటీలతో విద్యా సంస్థలను నడుపుతున్నా ఈ రెండు సంస్థలకు చెందిన మాఫియా..తెరచాటున మరో రెండు కొత్త కార్పొరేట్‌ కంపెనీలను ఏర్పాటు చేసి దోపిడి చేస్తుండటం గమనార్హం. నారాయణ విద్యా సంస్థలు ఎన్‌ స్పైరా, శ్రీచైతన్య మాఫియా వర్‌ సిటీ కార్పొరేట్‌ కంపెనీలను ఏర్పాటు చేసుకుని గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో పాటు శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరిలో విస్తరించిన శ్రీచైతన్య, నారాయణ(చైనా) మాఫియా సంస్థలు తమ కొత్త సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఆరితేయాని విశ్వసనీయ సమాచారం. నారాయణ, శ్రీచైతన్య సంస్థలు బయటకు సొసైటీ పేరుతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని, దీనికి ట్యూషన్‌ ఫీజుల కింద వేల కోట్ల ధనాన్ని దోచుకుంటున్న విషయం మాత్రమే ఇప్పటి వరకు అందరికి తెలుసు. అయితే ఏదైనా సొసైటీ మొదట 50 శాతం రాబడిని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌తో పాటు ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా మరో 40 శాతం నిధులను సంస్థల బలోపేతానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన అంటే కేవలం పది శాతం మాత్రమే ఆయా యాజమాన్యాలు ప్రాఫిట్‌గా భావించాలని సర్కార్‌ నిబంధనలే చెబుతున్నాయి. అయితే సర్కార్‌ నిబంధనలను తుంగలొ తొక్కుతూ…శ్రీచైతన్య- వర్‌ సిటీ, నారాయణ సంస్థలు- ఎన్‌ స్పైరా కార్పొరేట్‌ కంపెనీలను స్థాపించి..విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సంస్థల్లో లేని పోస్టులను క్రియేట్‌ చేసి..అనవసరంగా లక్షల జీతాలు చెల్లించడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రకమైన దోపిడికీ పాల్పడటమే కాకుండా ఆదాయపు పన్ను శాఖలను సైతం బురిడీ కొట్టిస్తూ..ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరే ట్‌(ఈడీ) లాంటి సంస్థలను నిర్వీర్యం చేయడానికి భారీ స్థాయిలో కుట్రలు చేస్తున్నా ఇంత వరకు రాజ్యాంగ పరమైన సంస్థలు ఈ అవినీతిపై విచారించకపోవడం అంతుచిక్కడం లేదు..?.

Advertisement

తాజా వార్తలు

Advertisement