Friday, November 22, 2024

విలీన ఎయిడెడ్‌ కళాశాలల సిబ్బందికి వేతనాలు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వంలో విలినమైన ఎయిడెడ్‌ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. విలీనం కాని సిబ్బందికి, రి-టైర్‌ అయిన సిబ్బందికి ప్రస్తుతమున్న 060 పద్దు కిందనే జీతాలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, ఎయిడెడ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.త్రివిక్రమ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అయితే విలీనమైన అధ్యాపకులకు సర్వీసు రూల్సు, బోధనేతర సిబ్బందికి పదోన్నపతులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద జీతాలు పొందుతున్న మోడల్‌ స్కూల్స్‌ టీచర్లను కూడా విద్యాశాఖలో విలీనం చేసి వీరికి కూడా 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చొరవచూపాలని ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, ఎంఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షులు కోమటిరెడ్డి శివశంకర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement