జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ కార్యదర్శుల నెల వేతనం ప్రస్తుతం రూ.15వేలు ఉండగా.. దాన్ని రూ.28,719కి పెంచింది. అలాగే ప్రొబేషన్ పీరియడ్ మూడు నుంచి నాలుగేళ్లకు పెంచింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
పెంచిన జీతాలు జూలై 1 నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పోస్టులను ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రొబేషన్ పీరియడ్‌ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రొబేషన్ టైమ్ పూర్తయి రెండు నెలలు గడిచింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జేపీఎస్‌ల ప్రొబేషన్ టైమ్‌ను రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వార్త కూడా చదవండి: ప్రగతి భవన్‌ను ముట్టడించిన లంబాడీ హక్కుల సమితి