కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటంతో ఈ ఏడాది తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చి వేతనాలు పెంచేందుకు సుముఖంగా ఉన్నామని 59 శాతం దేశీయ సంస్థలు తెలిపినట్లు స్టాఫింగ్ కంపెనీ జీనియస్ కన్సల్టెంట్స్ అధ్యయనం పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆన్‌లైన్‌లో 1,200 కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదికను రూపొందించినట్లు జీనియస్ కన్సల్టెంట్స్ వివరించింది.
ఇక్రిమెంట్‌ను 5-10 శాతం మధ్య ఇవ్వాలనుకుంటున్నట్లు 59 శాతం సంస్థలు వెల్లడించాయి. 5 శాతం కంటే తక్కువ వేతన పెంపు ఇస్తామని 20 శాతం సంస్థలు పేర్కొన్నాయి. వేతన పెంపునకు సిద్ధంగా లేమని 21 శాతం కంపెనీలు తెలిపాయి. కొత్త నియామకాలకు సిద్ధంగా ఉన్నామని 43 శాతం, ప్రస్తుతం ఉన్న వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని 41 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. కొత్త నియామకాలకు అవకాశమే లేదని 11 శాతం సంస్థలు తేల్చిచెప్పాయి. కంపెనీని బలోపేతం చేసుకునేందుకు 15 శాతం మంది కొత్త వారిని తీసుకుంటామని 21 శాతం సంస్థలు వెల్లడించాయి. 10-15 శాతం కొత్త ఉద్యోగులను తీసుకుంటామని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 10 శాతsal కొత్త వారిని తీసుకుంటామని 30 శాతం కంపెనీలు పేర్కొనగా, కొత్త నియామకాలు ఉండవని 23 శాతం సంస్థలు తేల్చాయి. కాగా ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తామని 4 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.
https://www.linkedin.com/news/story/your-salary-hike-in-2021-4370753/