విమానాల్లో సాంకేతిక లోపం వలన అత్యవసర ల్యాండింగ్స్ సర్వసాధారణమైంది. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇది గమనించిన పైలెట్ అప్రమత్తమైన వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి… బంగ్లాదేశ్ కి చెందిన సలామ్‌ఎయిర్ ఓవీ406 విమానం 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్ వెళ్తున్నది. అయితే విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించాడు. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని దించడానికి అధికారులు అనమతించారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో అత్యతవసరి పరిస్థితి ప్రకటించారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో మొత్తం 200 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement