Tuesday, November 19, 2024

Opinion: సలాం నీకు.. సర్వాయి పాపన్న!

హస్తినా పాలకుల వెన్నులో మనకు పుట్టించిన తొలి తెలంగాణ తేజం.. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కారించి న దిశాలి. సమసమాజ స్థాపన సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు. ఔరంగ జేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. బడుగు బలహీన పేద ప్రజల పాలిట ఆపద్బాంధవుడు. క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్ణాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడు. పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని భారతదేశానికి అందించిన వ్యక్తి అతను.. ఎవరో కాదు మరెవరో కాదు తెలంగాణ శివాజీ సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌. వీరత్వంలో శివాజీకి ఏమాత్రం తీసిపోని సర్వాయి పాపన్నను గుర్తు చేసుకుందాం.

ఈ రోజు సర్వాయి పాపన్న పుట్టిన రోజు. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌.. మూడున్నర శతాబ్దాల క్రితం ఈ పేరో సంచలనం. రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించడమే పాపమయిన కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన బహుజన చక్రవర్తి.. నవాబుల తాబేదార్‌ గా మారిన అగ్రవర్ణ దోపిడి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి. 17వ శతాబ్దిలోనే తెలంగాణ గడ్డపై పోరువిత్త నాలు నాటిన విప్లవకారుడు. బలహీన వర్గ కుటుంబంలో పుట్టి రాచరిక పునాదులను కదిలించిన ధీరోధాత్తుడు సర్వాయి పాపన్న గౌడ్‌. తెలంగాణ పౌరుషాన్ని పోతపోసుకున్న గౌడ్‌ సాబ్‌ సర్వాయి పాపన్న వరంగల్‌ జిల్లా ఖిలాషాపూర్‌లో 1650 ఆగస్ట్‌ 18న జన్మించాడు. తండ్రి చిన్నప్పుడే మరణించ డంతో తల్లి సర్వమ్మే సర్వస్వమై పాపన్నను పెంచింది. రాచరిక వ్యవస్థ నీడలో జమీన్‌ దార్లు, జాగీర్‌ దార్లు, భూస్వామ్య దొరలు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడడంతో అతనికి చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరన రాన పాకింది.

అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకు న్నాడు. కులవృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు. అయితే అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు. అందుకే స్నేహితులైనన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్‌ మహ్మద్‌, కొత్వాల్‌ మీర్ సాహెబ్‌లతో గెరిల్లా సైన్యాన్ని తయారుచేశాడు. అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన పేదలకు పంచాడు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించాడు. పన్నెండు మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్‌ సైన్యం పన్నెండు వేలకు చేరింది.

చిన్న చిన్న సంస్థాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు పాపన్న గౌడ్‌. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వర కు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్నీ రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకు న్నాడు. ఖిలాషాపూర్‌లో పటిష్టమైన కోటను కట్టించాడు. పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. కులవృత్తులను ప్రోత్స#హంచాడు. వేలాది ఎకరా ల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించాడు. దక్కన్‌ సామ్రాజ్యంపై ఢిల్లిd పెత్తనాన్ని ధికారించి గోల్కొండ కోటపై బ#హుజన స్వాతంత్ర బాగుట ఎగరేసి న సర్దార్‌ సర్వాయి పాపన్న పోరాటం నేటికీ యువతకు సూక్తిదాయకం. ఇకనైనా పాపన్న చరిత్రను భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం నేటి సభ్య సమాజంలో ఉన్న పాలకు లపై ఉంది.

  • నరేష్‌ జాటోత్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement