Saturday, November 23, 2024

ASRTU స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా సజ్జనర్..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ASRTU) స్టాండింగ్ కమిటీ కొత్త చైర్మన్‌గా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని ఇండియా హబిటెంట్ సెంటర్ లో జరిగిన ఏఎస్ఆర్టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్ లో స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా దేశంలోని ఆర్టీసీల ఎండీలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవీలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ గా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్(సీఎంఈ) శ్రీ రఘునాథ రావు ఎన్నికైనట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement